20, సెప్టెంబర్ 2014, శనివారం

మరణం నా జన్మ హక్కు

కలుస్తారో .. కల గంటారో
కాలు జారుతారో
అంతా మీ ఇష్టం
చిలకప్రశ్న వేస్తారో ..జాతకం చూస్తారో
అండ పిండానికి అంకురార్పణ చేస్తారో
అంతా మీ ఇష్టం
పిండనిర్ధారణ వరకూ వస్తారో
మందు బిళ్ళతో
పిండ ప్రదానం చేస్తారో
అంతా మీ ఇష్టం
నడక, నడత నేర్పుతారో
నరకం చూపుతారో
అంతా మీ ఇష్టం
చదివిస్తారో
చట్టుబండలు చేస్తారో
మీ స్వయం నిర్ణయాధికారం
ప్రేమిస్తారో .. ద్వేషిస్తారో
లింగ భేదం చూపిస్తారో
మీ విచక్షణాదికారం
నెలలో మూడు రోజుల వెలికి
ప్రకృతి సిద్ధమైన లైసెన్సు
ఆశీర్వదిస్తారో ..ఆంక్షలు విదిస్తారో
అంతా మీ ఇష్టం
పెళ్లి చూపుల సంతకు తరలిస్తారో
ప్రేమించినోడి చెంతకు చేరుస్తారో
అంతా మీ ఇష్టం
కట్నానికి బలిస్తారో .. వేధింపులతో వేటేస్తారో
అనుమానాలతో అంతమొందిస్తారో
అంతా మీ ఇష్టం
ఆడమ్ అండ్ ఈవ్
ఎవడ్రా మిమ్మల్ని కలవనిచ్చింది
ఒరే ఆడమ్ .. ఆడోళ్ళ ఉసురు తీశావ్ గదరా
కండోమ్ తో ఉరేసి .. టాబ్లెట్లతో చిదిమేసి
కత్తులతో కోసేసి .. కళ్ళు తెరవక ముందే
కారుణ్య మరణం ప్రసాదిస్తున్నారు
మొండిగా కళ్ళు తెరిస్తే
నర్సరీ నుంచి నడవలేని ముసలమ్మా వరకూ
కన్ను మూయాల్సిందే
కామాంధులకు బలి కావాల్సిందే
అగ్గిపుల్ల.. నైలాన్ తాడు
పురుగు మందు.. నేల బావి
తలదిండు.. పడక మంచం
కత్తి .. యాసిడ్
నన్ను చంపేందుకు ఎన్ని ఆయుధాలు
మరణం నా జన్మ హక్కు
............... శ్రీచమన్ (20-09-2014)

మరణం నా జన్మ హక్కు

మరణం నా జన్మ హక్కు 

కలుస్తారో .. కల గంటారో
కాలు జారుతారో 
అంతా మీ ఇష్టం  

చిలకప్రశ్న వేస్తారో ..జాతకం చూస్తారో 
అండ పిండానికి అంకురార్పణ చేస్తారో 
అంతా మీ ఇష్టం  

పిండనిర్ధారణ వరకూ వస్తారో 
మందు బిళ్ళతో 
పిండ ప్రదానం చేస్తారో 
అంతా మీ ఇష్టం  

నడక, నడత నేర్పుతారో 
నరకం చూపుతారో 
అంతా మీ ఇష్టం 

చదివిస్తారో 
చట్టుబండలు చేస్తారో 
మీ స్వయం నిర్ణయాధికారం 

ప్రేమిస్తారో .. ద్వేషిస్తారో 
లింగ భేదం చూపిస్తారో 
మీ విచక్షణాదికారం  

నెలలో మూడు రోజుల వెలికి
ప్రకృతి సిద్ధమైన లైసెన్సు 
ఆశీర్వదిస్తారో ..ఆంక్షలు విదిస్తారో 
అంతా మీ ఇష్టం 

పెళ్లి చూపుల సంతకు తరలిస్తారో
 ప్రేమించినోడి  చెంతకు చేరుస్తారో 
అంతా మీ ఇష్టం  

కట్నానికి బలిస్తారో .. వేధింపులతో వేటేస్తారో 
అనుమానాలతో అంతమొందిస్తారో 
అంతా మీ ఇష్టం 

ఆడమ్ అండ్ ఈవ్ 
ఎవడ్రా  మిమ్మల్ని కలవనిచ్చింది 
ఒరే ఆడమ్ .. ఆడోళ్ళ ఉసురు తీశావ్ గదరా 


కండోమ్ తో ఉరేసి .. టాబ్లెట్లతో చిదిమేసి 
కత్తులతో కోసేసి .. కళ్ళు తెరవక ముందే 
కారుణ్య మరణం ప్రసాదిస్తున్నారు 

మొండిగా కళ్ళు తెరిస్తే 
నర్సరీ నుంచి నడవలేని ముసలమ్మా వరకూ 
కన్ను మూయాల్సిందే 
కామాంధులకు బలి  కావాల్సిందే 

అగ్గిపుల్ల.. నైలాన్ తాడు 
పురుగు మందు.. నేల బావి 
తలదిండు.. పడక మంచం 
కత్తి .. యాసిడ్ 
నన్ను చంపేందుకు ఎన్ని ఆయుధాలు 
మరణం నా జన్మ హక్కు 

............... శ్రీచమన్ (20-09-2014)




23, మే 2012, బుధవారం

ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది ...

ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది ...
ఎండలు మండుతున్నై 
బావులు ఎండు తున్నై 
ఇం 'ధనం' పెరిగింది 
మన ధనం తరిగింది 
మధ్య తరగతి బండి 
ఎలాగ నడిచేనండి 

7, ఫిబ్రవరి 2011, సోమవారం

మరణ వాంగ్మూలం

నింగీ నేల
మన్నూ మిన్నూ మధ్య
మెతుకు కోసం .. బతుకు కోసం
ఆశ చావని నేను
రాస్తున్నా మరణ వాంగ్మూలం

నేను అన్న దాతను కాను
నా తల రాత కూడా రాసుకోలేని నిరక్షరాస్యుడిని

నాదో వ్యాపారం
అన్నీ కొంటాను ..
చివరికి అమ్ముకున్దామనుకుంటాను
విత్తనాలు చల్లి రూపాయలేరుకున్దామనే ..


నీరు నిప్పైయ్యింది
పురుగు పోటు.. కరువు కాటు
అన్నింటినీ తట్టుకుంటే
దళారీకి ఫలహారం

ఎప్పుడూ
చీడ పీడల కలలు
వానగాలుల భయాలు
వడగాడ్పుల పలవరింతలు

చేను మేసిన కంచె
చెరువును కొట్టేసిన గట్టు
శ్వాస ఆపిన ఆశ
మందునూ తినేసిన పురుగులు

అదిగో క్రిమిసంహారక మందు
ఇదిగో దాని రసీదు
ఇదే నా శవ పంచనామా
నా చావుకు ఎవరూ కారణం కాదు

యుద్ధభూమిలో నేలకొరిగిన సైనికుడిలా
జల్విలయానికి బురద కరిచిన పంట చేల నుంచి ..
ప్రత్యక్ష ప్రసారం ...

మీరిప్పుడు చూస్తున్నవిజువల్స్
ఆత్మహత్య చేసుకున్న
కౌలురైతు ఇంటినుంచి
మన చానల్కే ప్రత్యేకం

రోజూ చచ్చేవాడిని
ఎవడో పరామర్సిస్తున్నాక్కడ
దేశంలో ఎక్కడా లేని చావు ప్యాకేజి
వ్యవసాయం దండగని ఎవడన్నాడు .. పండగ చేసుకో ..


శ్రిచమన్- 9490638222

13, నవంబర్ 2010, శనివారం

తూరుపు ..మారుపు కోరుతోందా?

తూరుపు కోరేది మార్పు కాదు
నిత్య నవోదయం
ఆ వెలుగు కోరేది స్వేచ్చ
అది ఓ అమాయక ఇచ్చ

ఉదయం
సాయంత్రానికి
అస్తమయం
అయినా కుంకని ఆశయం

అది ఓ చరిత్ర
అక్షరక్రమంలో సాయుధ రైతాంగ పోరాటం
జీవితంలో మనుగడ పోరాటం
సికాకులం ..శ్రీకాకుళం